APSSDC: జాబ్‌మేళాలతో భారీగా ఉద్యోగ కల్పన

గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 987 జాబ్‌మేళాలు నిర్వహించి.. 1,05,889 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ ఏడాది కూడా 286 జాబ్‌మేళాలు నిర్వహించడం ద్వారా కనీసం 30,000 మందికి ఉద్యోగాలు లభించే విధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో సుమారు 200 కంపెనీలను గుర్తించి వారికి అవసరమైన మానవ వనరులను అందించే విధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇందుకోసం మినీ జాబ్‌మేళా, జాబ్‌మేళా, మెగా జాబ్‌మేళాలు నిర్వహించనుంది.
చదవండి: 1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్–సి హోదాలో కేంద్ర కొలువులు
రాష్ట్రంలో ప్రతి మంగళవారం మినీ జాబ్‌మేళా, శుక్రవారం జాబ్‌మేళా, ప్రతి మూడు నెలలకు ఒకసారి జోన్ పరిధిలో మెగా జాబ్‌మేళా నిర్వహించే విధంగా క్యాలెండర్ సిద్ధం చేసింది. ఇంటర్‌లోపు విద్యార్హత ఉన్న వారికి ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 192 స్కిల్ హబ్స్ ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతి మంగళవారం నిర్వహించే మినీ జాబ్‌మేళాల ద్వారా ఉపాధి కల్పించనుంది. మూడు, నాలుగు కంపెనీలకు మానవ వనరులు అవసరం కాగానే మినీ జాబ్‌మేళా, కనీసం 10 కంపెనీలకైతే జాబ్‌మేళా నిర్వహిస్తారు. ఇవి కాకుండా జోన్ పరిధిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కనీసం 50 కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు.
జాబ్‌మేళాలతో వివిధ సంవత్సరాల్లో కల్పించిన ఉద్యోగాలు
సంవత్సరం |
జాబ్‌మేళాల సంఖ్య |
కల్పించిన ఉద్యోగాలు |
2019–20 |
350 |
28,655 |
2020–21 |
122 |
14,603 |
2021–22 |
359 |
38,650 |
2022–23 |
156 |
23,981 |
మొత్తం |
987 |
1,05,889 |