Jagananna Videshi Vidya Deevena: విదేశీ విద్యా దీవెన వరం
ఈ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి.రంజిత్ బాషా, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బి.సురేంద్ర, బీసీ కమిషన్ సభ్యులు ఎ.ముసలయ్యతోపాటు లబ్ధిదారులు వీక్షించారు. అనంతరం వీరు అర్హులైన విద్యార్థులకు చెక్కును అందించారు. కలెక్టర్ రంజిత్‌బాషా మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తోందని చెప్పారు.
చదవండి: 100% Fee Reimbursement: ఉన్నత చదువులకు అండగా.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’
విద్యార్థులు గొప్పగా ఎదిగి బహుళజాతి కంపెనీలలో సీఈఓలుగా రాణించాలని, గొప్ప నాయకులు కావాలని ఆకాంక్షించారు. జిల్లాలో 12 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ.1.33 కోట్ల లబ్ధి కలుగుతుందని వివరించారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిణి జె.రాజదెబోరా, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి కల్పన, ఎస్టీ సంక్షేమశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: Jagananna Videshi Vidya Deevena 2023 : పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో చదివేలా..