100% Fee Reimbursement: ఉన్నత చదువులకు అండగా.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి వర్చువ ల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బటన్ నొక్కి రూ.45.53 కోట్ల నిధులను జమచేశారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్, అధికారులు వీక్షించారు.
Also read: Jagananna Videshi Vidya Deevena: విద్యాదీవెన పథకానికి అర్హత.. ధన్యవాదాలు తెలిపిన సాయికిరణ్
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూ.1.25 కోట్లు, ఇతర విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ.కోటి వరకు అందజేస్తోందన్నారు. ఇతర దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న రాష్ట్రంలోని 357 మంది విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంతో లబ్ధిచేకూరుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి గయాజుద్ధీన్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Also read: CM Jagan Good News: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల #sakshieducation
పేదకుటుంబాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిషాంత్‌కుమార్