YS Jagan Mohan Reddy : బడి పిల్లలకు.. జగనన్న గోరుముద్ద ద్వారా రాగి జావ.. ఇంకా..
తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచ్చిస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
☛ గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు రాగి జావ అందిస్తున్నాం: సీఎం జగన్
☛ ఉన్నత విద్యలోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నాం
☛ విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్థుల భవిష్యత్‌కు అండగా ఉంటున్నాం
☛ గోరుముద్ద కార్యక్రమాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేస్తున్నాం
☛ ఇవాళ్టి నుంచి గోరుముద్దలో రాగి జావ చేరుస్తున్నాం
☛ ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ పథకం అందిస్తున్నాం
☛ సత్యసాయి ట్రస్ట్ సహాకారంతో విద్యార్థులకు రాగి జావ
☛ కొత్త పథకానికి ఏటా 86 కోట్ల రూపాయల వ్యయం
Education News: ఇలా చేస్తే ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చదువుకోవచ్చు.. అయితే వీరికి మాత్రమే
☛ బడి పిల్లల మేథో వికాసానికి అనుకూల వాతావరణంపై దృష్టిపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బడి మానేసే పిల్లల సంఖ్య తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ‘‘గవర్నమెంట్ స్కూళ్లను డిజిటలైజేషన్ చేస్తున్నాం. ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌లోనూ డిజిటల్ బోధన. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందించాం’’ అని సీఎం అన్నారు.
☛ మధ్యాహ్న భోజనానికి సీఎం జగన్ ఓ రూపం తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్కూళ్లలో సుమారు 15 వైరైటీలతో రోజుకో మెనూ అమలు చేస్తున్నామన్నారు. పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉండకూడదనే సీఎం ఆశయం అని మంత్రి బొత్స అన్నారు.
☛ జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏటా రూ.1,910 కోట్లు..
☛ మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఏటా రూ.1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచ్చిస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
☛ మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేపట్టి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ రుచికరమైన మెనూతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని) బెల్లంతో కూడిన రాగిజావను అందించనున్నారు.
☛ ఇక మిగిలిన 3 రోజులు గోరుముద్దలో బలవర్థకమైన చిక్కీని పిల్లలకు ఇస్తున్నారు. జగనన్న గోరుముద్దలో వారానికి 15 వెరైటీలు ఉండగా ఐదు రోజుల పాటు కోడిగుడ్డు, 3 రోజులు చిక్కీ ఇస్తున్నారు. ఇకపై మూడు రోజులు రాగిజావ కూడా అందనుంది. ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కావడం, చిరుధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో పథక నిర్వహణలో భాగంగా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు.