Skip to main content

కాంట్రాక్టు లెక్చరర్ల జీతాల పెంపు.. పెరగనున్న జీతాల ఇవే..

ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఏపీఆర్‌ఈఐ) సొసైటీ రెసిడెన్షియల్‌ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను ప్రభుత్వం పెంచింది.
Increase in salaries of contract lecturers
కాంట్రాక్టు లెక్చరర్ల జీతాల పెంపు.. పెరగనున్న జీతాల ఇవే..

వీరికి రివైజ్డ్‌ పేస్కేల్‌ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనుంది. యూనివర్సిటీలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్ల కాంట్రాక్టు సిబ్బందికి మినిమం టైమ్‌స్కేల్‌ను మంజూరు చేస్తూ గతంలో ఆర్థికశాఖ 40వ నంబరు జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఏపీఆర్‌ఈఐ సొసైటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్‌.నరసింహరావు మెమో ఇచ్చారు. ఈ పెంపు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం పెరగనున్న జీతాల వివరాలు..

చదవండి: 

TET 2022: టెట్‌ పరీక్ష ప్యాట్రన్‌ ఇలా..

Good News: కేజీబీవీల్లో వెయ్యిమంది టీచర్ల నియామకం

విభాగం

ప్రస్తుత జీతం (రూపాయల్లో)

పెరగనున్న జీతం
(రూపాయల్లో)

డిగ్రీ కాలేజీ లెక్చరర్‌

37,100

57,100

జూనియర్‌ లెక్చరర్‌

35,120

54,060

పీజీటీ

31,460

48,440

టీజీటీ

28,490

44,570

స్టాఫ్‌ నర్సు

25,140

38,720

పీఈటీ

21,230

32,670 

Published date : 03 Jun 2022 01:07PM

Photo Stories