Good News: కేజీబీవీల్లో వెయ్యిమంది టీచర్ల నియామకం
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వెయ్యి మంది బోధనా సిబ్బందిని తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
సమగ్రంగా చర్చించిన తర్వాత అవసరమైన మార్గదర్శకాలను అధికారవర్గాలు విడుదల చేసే వీలుంది. కేజీబీవీల్లో 6నుంచి ఇంటర్మీడియెట్ వరకూ బోధిస్తారు. కొంతకాలంగా బోధన, బోధనేతర సిబ్బంది కొరత కేజీబీవీలను వేధిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టు పద్ధతిలో వెయ్యి మంది మహిళా టీచర్లను నియమించాలని భావిస్తున్నారు. బీఈడీ చేసిన వారిని ఇంటర్వూ్యల ద్వారా ఎంపిక చేసే వీలుందని, కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి:
గిరిజన సంక్షేమ పాఠశాలలకు కొత్త రూపు
అత్యధిక ఖాళీలు ఈ శాఖలోనే .. ఎలాగైనా టీచర్ ఉద్యోగాలను..
ఆంగ్ల భాష ఉచ్ఛారణపై శిక్షణ ప్రారంభం
సాంకేతిక బోధనపై టీచర్లకు శిక్షణ
30 వేల మంది ఎస్‌జీటీలకు పదోన్నతుల వెల్లువ.. ప్రయోజనాలు ఇవే..
Published date : 20 Apr 2022 02:53PM