Skip to main content

IGNOU Admission 2023: ఇగ్నో ప్రవేశాల గడువు పెంపు

ignou admission has extended date

ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): ఇగ్నోలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్‌ గోనిపాటి ధర్మారావు గురువారం ప్రకటనలో తెలిపారు. కేంద్రం పరిధిలోని 5 జిల్లాల విద్యార్థులకు డిగ్రీ, పీజీ, ఎంబీఏ, డిప్లమో, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. https:// ignou admission.samarth.edu.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఎంవీపీ కాలనీ ఉషోదయ కూడలిలో ఇగ్నో కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

UPSC - CSAT Free Coaching: ప్రవేశ పరీక్ష తేదీ పొడిగింపు

Published date : 04 Aug 2023 03:31PM

Photo Stories