UPSC - CSAT Free Coaching: ప్రవేశ పరీక్ష తేదీ పొడిగింపు
ఈ శిక్షణకు రిజర్వేషన్ల ప్రకారం మహిళా అభ్యర్థులకు 33.33 శాతం, అన్ని రిజర్వు కేటగిరిల్లో దివ్యాంగులకు 5 శాతం సీట్లు కేటాయించారు. రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్‌లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందని పేర్కొన్నారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
ప్రవేశం కోసం జిల్లాలోని సాధారణ, ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన మైనార్టీ అభ్యర్థులు www.cet.cgg.gov.in/tmreir వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. దరఖాస్తు తేదీని ఆగస్టు 13 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈనెల 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాకేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. వివరాల కోసం వెబ్‌సైట్‌లో, 040–23236112 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.