ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా
Sakshi Education
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న లేఆప్స్ విషయంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ట్విటర్‌లో వేలాది ఉద్యోగులను తొలగించిన సీఈఓ మస్క్ సిబ్బంది తొలగింపుల విషయంలో తన విధానాన్నేఅనుసరించాలంటూ సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలకు సలహా ఇచ్చారు.
ఫలితంగా ఉత్పాదకత మెరుగుపడిందని వ్యాఖ్యానించారు. ‘ఉద్యోగాల కోతతో ఫలితాలు బావున్నాయి. ఇదే నిజం. ఉత్పాదకతను ప్రభావితం చేయకుండా ఇతర కంపెనీలు కూడా ఇలాగే చేయాలి’ అంటూ సలహా ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Published date : 26 May 2023 04:39PM