ICAI: సీఏ కోర్సులో నూతన నిబంధనలు ఇవే.. వీటి గురించి తెలుసా
ఈ మూడు దశలు క్వాలిపై అయితేనే చార్టెడ్ అకౌంటెన్సీ సర్టిఫికేట్ వస్తుంది. మూడు దశలు పూర్తి చేసి, సీఏగా క్వాలిఫై అవుతున్న వారి సంఖ్య వేళ్లపైన లెక్కపెట్టొచ్చు.
ఈ నేపథ్యంలో సీఏ కోర్సులు, సిలబస్, అడ్మిషన్ ప్రాసెస్, ప్రాక్టికల్ ట్రైనింగ్ మాడ్యుల్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు నూతన జాతీయ విద్యావిధానం-2020 అనుగుణంగా ICAI సవరించింది.
సీఏ ఫౌండేషన్ కోర్సు...
సవరించిన నిబంధనల ప్రకారం.. భారతదేశం వెలుపల ఉన్న అభ్యర్థులు ఎప్పటికప్పుడు కౌన్సిల్ నిర్ణయించిన విధంగా ఎన్‌రోల్ కావడానికి, ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. చార్టెడ్ అకౌంటెంట్స్ (సవరణ) నిబంధనలు- 2023 అమల్లోకి వచ్చే ముందు కామన్ ప్రొఫిషియెన్సీ కోర్సు కోసం ఇప్పటికే ఎన్‌రోల్ చేసుకున్న విద్యార్థులు తాజాగా ఫౌండేషన్ కోర్సుకు మారడానికి అవకాశం ఉంటుంది. ఫౌండేషన్ కోర్సు అనేది సీఏలో ఎంట్రీ లెవల్ కోర్సు. ఫౌండేషన్ కోర్సు కోసం రిజిస్ట్రేషన్ తరువాత మొదటి ప్రయత్నం తేదీ నుంచి నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అవుతుంది.
IBPS Clerk: బ్యాంకు జాబ్ రావాలంటే... ఈ స్కోరు ఉండాల్సిందే.. నూతన నిబంధనపై అభ్యర్థుల ఫైర్
సీఏ ఇంటర్మీడియట్ కోర్సు...
సీఏ ఫౌండేషనల్ కోర్సులో క్వాలిఫై అయినవారు సీఏ ఇంటర్మీడియట్ కోర్సుకు అర్హత సాధిస్తారు. తాజాగా ఇంటర్మీడియట్ కోర్సును గ్రూప్ 1, గ్రూప్ 2గా విభజించారు. ఫౌండేషన్ కోర్సు, 10+2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఈ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు కూడా సీఏ ఇంటర్మీడియట్ కోర్సులో నమోదు చేసుకోవడానికి అర్హులు.
Success Story: వరుసగా నాలుగు సార్లు ఫెయిల్...ఏడేళ్ల నిరీక్షణ.. చివరికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...
55 శాతం మార్కులు వచ్చి ఉంటేనే...
కామర్స్ స్ట్రీమ్‌లో అకౌంటింగ్, ఆడిటింగ్, మర్కంటైల్ లా, కార్పొరేట్ లా, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్ (ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్), ట్యాక్సేషన్, కాస్టింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి వాటిల్లో కనీసం మూడు కామర్స్ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 55% స్కోర్ చేసి ఉంటేనే ఇంటర్మీడియట్ కోర్సును అభ్యసించే వెసులుబాటును తాజా సవరణ ద్వారా కల్పించారు.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీతో సహా) నిర్వహించే పరీక్షలో కామర్స్ స్ట్రీమ్‌లో 60% మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్ సాధిస్తే ఇంటర్మీడియట్ కోర్సులో డైరెక్ట్‌గా జాయిన్ కావచ్చు. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్-గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఇంటర్మీడియట్ కోర్సు కోసం ఎన్‌రోల్ చేసుకోవచ్చు. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రమే ఎన్‌రోల్ ను ధృవీకరిస్తారు.
SSC : పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... ప్రారంభ వేతనం రూ.35 వేలు
సీఏ ఫైనల్ కోర్స్...
ఫైనల్ కోర్సు కోసం అప్లై చేసుకోవాలంటే ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్‌పై అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సుతో సహా ఇంటర్మీడియరీ కోర్సు క్వాలిఫై అయి ఉండాలి. ఇంటర్ మీడియట్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒక్కో గ్రూప్‌లో కనీసం 40% మార్కులు ఓవరాల్‌గా 55% మార్కులను ఒకే సిట్టింగ్‌లో పొందాలి. గ్రూప్1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, గ్రూప్ 2 పరీక్షలో ఫెయిల్ అయితే ఫైనల్ కోర్సులో చేరాలంటే తప్పనిసరిగా రెండో పేపర్ క్వాలిఫై అవ్వాలి.