Skip to main content

Tenth, Inter and Degree students for Online exams: టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు

District-wide Commerce Olympiad on December 3, Online Exam for Students from Class 8 to Degree, Commerce Olympiad Exam conducted by ICAI, Online exams, CA Pannaraj, President of Southern Association of Chartered Accountants,
Online exams

జిల్లా వ్యాప్తంగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో డిసెంబర్‌ 3న జిల్లాలో 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో కామర్స్‌ ఒలింపియాడ్‌ పరీక్ష జరుపుతున్నట్లు దక్షిణ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ సంఘం అధ్యక్షుడు సీఏ పన్నారాజ్‌ తెలిపారు.

మంగళవారం పార్వతీనగర్‌లోని గౌరీ హళ్లిమనెలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలో పాల్గొనగోరు విద్యార్థులు పేరు నమోదు చేసుకోడానికి ఈనెల 27 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఐసీఏఐ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించడం దేశంలోనే మొదటిసారన్నారు.

గతంలో డిగ్రీలో 50 శాతం మార్కులు పొందిన వారికే సీఏ పరీక్ష రాసేందుకు అర్హత ఉండేదన్నారు. బీకాం పూర్తి చేసిన విద్యార్థులు సీఏ చేయడానికి వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు సీఏ కోర్సులో ప్రవేశానికి పీయూసీ నుంచే బీజం పడిందన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాలకు ఒలింపియాడ్‌ పరీక్ష గురించి తెలిసేలా డీడీపీఐ ద్వారా చర్యలు తీసుకొంటున్నామన్నారు.

10వ తరగతి వరకు సోషియల్‌, మ్యాథ్స్‌, బిజినెస్‌ అవేర్‌నెస్‌, ఆప్టిట్యూడ్‌ సబ్జెక్ట్‌లపై పరీక్ష ఉంటుందన్నారు. ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు బిజినెస్‌ స్టడీస్‌, అకౌంటెన్సీ, ఎకనామిక్స్‌, ఆప్టిట్యూడ్‌ సబ్జెక్ట్‌లపై 100 మార్కులకు గాను 50 మార్కులను అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు.

Published date : 24 Nov 2023 07:46AM

Photo Stories