Graduation Ceremony: డియర్ అచ్చూ.. కంగ్రాట్స్.. ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకున్న మంత్రి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట జోన్: అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కుమారుడు అర్చిష్మాన్ పట్టభద్రుడయ్యాడు.
భారత కాలమానం ప్రకారం మే 11న యూనివర్సిటీలో జరిగిన పట్టా ప్రదానోత్సవంలో అర్చిష్మాన్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. పట్టా ప్రదానోత్సవానికి హాజరైన మంత్రి హరీశ్ రావు తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
చదవండి: Harish Rao: 10జీపీఏ విద్యార్థులకు రూ.10వేలు నగదు పురస్కారం
‘నా కుమారుడు అర్చిష్మాన్ కొలరాడో యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డును కూడా అందుకున్నాడు’ అని పేర్కొన్నారు. డియర్ అచ్చూ.. కంగ్రాట్స్ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన కుమారుడి ప్రతిభకు గర్వపడుతునట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని హరీశ్ ఆకాంక్షించారు.
చదవండి: Medical students: పాఠం వినడంతో పాటు ఇకనుంచి పరిశోధనలు
Published date : 13 May 2023 03:19PM