SR University Chancellor: కష్టపడితే అత్యుత్తమ ఫలితాలు
ఈ సమావేశానికి వరదారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రయోజనాల కోసం భారతదేశ ప్రతిభను అభివృద్ధి చేయడానికి సార్వత్రిక నాణ్యమైన విద్య ఉత్తమ మార్గమన్నారు. సాంకేతిక సంబంధిత సామాజిక స్పృహా కలిగిన భావితరాన్ని తయారు చేసేందుకు ఎస్సార్ యూనివర్సిటీ కృషి చేస్తోందన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ మార్పులకనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.
చదవండి: విద్యార్థులకు ‘తొలిమెట్టు’ చాలా ముఖ్యం
విద్యార్థులు రోజూ ఒక కొత్త విషయం నేర్చుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి మాట్లాడుతూ 21వ శతాబ్దపు ప్రపంచీకరణ ప్రపంచంలో సరిపోయ్యేలా పాఠ్యాప్రణాళిక మార్పులను తీసుకొచ్చినట్లు వివరించారు. దీని అమలు వల్ల విద్యార్థులను అధిక వేతన ప్యాకేజీలతో మంచి కంపెనీల్లో పనిచేయడానికి వీలు కలుగుతుందన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.