విద్యార్థులకు ‘తొలిమెట్టు’ చాలా ముఖ్యం
మానకొండూర్‌లోని బాలుర హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ఆగస్టు 2న ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు వర్క్ బుక్స్, ఉపాధ్యాయులకు లెస్సన్ ప్లాన్ అందించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. మండల విద్యాధికారి మధుసూదనాచారి, అశోక్‌రెడ్డి, డి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
చదవండి: New Exam Pattern: విద్యా ప్రమాణాలు పెరుగుతాయి
ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం
హుజురాబాద్: విద్యార్థుల్లో భాషాపరమైన మౌలిక సామర్థ్యాల పెంపు కోసమే ప్రభుత్వం ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ ఇస్తున్నట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. ఆగస్టు 2న హుజూరాబాద్ పట్టణంలోని జెడ్పీ బా లుర ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ప్రా రంభమైంది.
చదవండి: OMR Sheet for School Exam: స్కూలు పరీక్షల్లో ఓఎంఆర్ షీట్లు
ఆయన మాట్లాడు తూ.. ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థేనని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో పిల్లలకు బోధిస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. హుజూరాబాద్ మండల విద్యాధికారి వెంకట నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 2, 3 తేదీల్లో తెలుగు, 4, 5 తేదీల్లో గణితం, 7, 8 తేదీల్లో ఆంగ్లంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ సత్యప్రసాద్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అంజయ్య, అనురాధ, రిసోర్స్ పర్సన్లు రమేశ్, ఆంజనేయులు, శ్రీనివాస్, సీఆర్‌పీలు దామోదరాచారి, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.