Skip to main content

New Exam Pattern: విద్యా ప్రమాణాలు పెరుగుతాయి

New Exam Pattern
విద్యా ప్రమాణాలు పెరుగుతాయి

పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న నూతన పరీక్షల విధానం వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మరింత పెరుగుతాయి. ఓఎంఆర్‌ షీట్ల నింపడంతో సందేహాలను చిన్న వయసులోనే నివృత్తి చేసుకుంటే భవిష్యత్‌లో ఉన్నత చదువుల సమయంలో ఎంతో ఆత్మ విశ్వాసంతో ఆయా పరీక్షలను రాయవచ్చు.
– వడ్లమూడి రామ్మోహన రావు, వైఎస్‌ఆర్‌ టీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

రెండు భాషల్లో ప్రశ్నాపత్రాలు మంచి నిర్ణయం

అంతర్గత పరీక్షల్లో తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ప్రశ్నాపత్రాలు ఇవ్వడం మంచి నిర్ణయం. దీని వల్ల విద్యార్థులు ప్రశ్నలను సులువుగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఓఎంఆర్‌ షీట్ల ద్వారా నిర్వహించే పరీక్షలతో విద్యార్థులకు పోటీ పరీక్షలంటే భయాందోళనలు తొలగిపోతాయి.
– రూపావత్‌ రంగయ్య, మండల విద్యాశాఖాధికారి –2, ఏలూరు

పోటీ పరీక్షలకు సంసిద్ధత

ఓఎంఆర్‌ జవాబు పత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించడం వల్ల భవిష్యత్‌లో పోటీ పరీక్షలను సమర్థంగా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉంటాడు. ప్రస్తుతం జరుగుతున్న ఫార్మేటివ్‌ పరీక్షల్లో ఈ విధానాన్నే అవలంభిస్తున్నాం. ఈ విధానం వల్ల పరీక్షల్లో ఓఎంఆర్‌ షీట్లలో పెన్సిల్‌తో దిద్దడానికి పట్టే సమయంపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతుంది.
– పీ శ్యామ్‌ సుందర్‌, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి

Published date : 03 Aug 2023 05:02PM

Photo Stories