APREIS: కాంట్రాక్టు సిబ్బంది రెన్యువల్‌కు మార్గదర్శకాలు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) ఆధ్వర్యంలోని రెసిడెన్సియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సేవలను 2022–23 విద్యాసంవత్సరానికి పునరుద్ధరించేందుకు సొసైటీ కార్యదర్శి జూన్ 18న మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు కాంట్రాక్టు సిబ్బందితో కొత్తగా ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. 2021 విద్యాసంవత్సరం పనిచేసినవారు మాత్రమే తాజా ఒప్పందానికి అర్హులని తెలిపారు. గత ఏడాది విధులకు సరిగా హాజరుకానివారు, అనధికారికంగా గైర్హాజరైనవారు సేవల పునరుద్ధరణకు అర్హులు కారని స్పష్టం చేశారు. ఆయా విద్యాసంస్థల్లోని సిబ్బంది అక్కడి ప్రిన్సిపాళ్లకు ఒప్పందాలకు సంబంధించిన నిర్ణీతపత్రాలు సమర్పించాలని సూచించారు. ఆయా టీచింగ్ సిబ్బంది పనితీరు నివేదికలను ప్రిన్సిపాళ్లు సొసైటీకి సమర్పించాలని పేర్కొన్నారు.
చదవండి:
Published date : 20 Jun 2022 03:43PM