Skip to main content

MBBS: ఎంబీబీఎస్‌ పరీక్ష పేపర్‌పై వివరణ ఇవ్వండి

ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం పరీక్ష పేపర్, ఆ తర్వాత సప్లిమెంటరీ పరీక్ష ప్రశ్న పేపర్లు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ 30 మంది ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
MBBS
ఎంబీబీఎస్‌ పరీక్ష పేపర్‌పై వివరణ ఇవ్వండి

ఈ పిటిషన్ ను ఇటీవల జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలి విచారించారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, కాళోజీ మెడికల్‌ యూనివర్సిటీలకు నోటీసులు జారీ చేశారు. మెడికల్‌ కౌన్సిల్‌ 2019 మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రశ్నపత్రం రూపొందించడంతో పిటిషనర్లు పరీక్షల్లో ఫెయిలయ్యారని వారి తరఫు న్యాయవాది నివేదించారు. నిబంధనల మేరకు తిరిగి ప్రశ్నపత్రం రూపొందించి పిటిషనర్లకు పరీక్ష నిర్వహించాలని, పారా క్లినికల్‌ క్లాసెస్‌కు వారిని అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేసును దసరా సెలవుల అనంతరం విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. 

చదవండి: 

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

నిట్‌ 19వ స్నాతకోత్సవం వివరాలు..

Published date : 12 Oct 2021 06:00PM

Photo Stories