ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు
ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 22 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కెమిస్ట్రీ (ఇనార్గానిక్, ఆర్గానిక్, అనలిటికల్, ఫిజికల్, అప్లైడ్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో పీజీ చేసి 30 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో మినహాయింపులు ఉంటాయి. రాత పరీక్షను నవంబర్ 11న నిర్వహిస్తారు.