Breaking News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వేతన కమిషన్‌ను అమలు..
Sakshi Education
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది కానుకగా 8వ వేతన సంఘం అమలులోకి రానుంది.
Good news for central government employees
ఎనిమిదో వేతన కమిషన్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జనవరి 16న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇది 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఉద్యోగులు ఏడవ వేతన సంఘం కింద వేతనాలు పొందేవారు. దీంతో పాటు శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష యాత్రకు ఊపునిచ్చేలా కొత్త లాంచ్ ప్యాడ్‌కు కేబినెట్ అనుమతి ఇచ్చింది. చదవండి: Forest Department Jobs: డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 67,000