తూర్పు మధ్య రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
తూర్పు మధ్య రైల్వేలో 2వేలకు పైగా ఉద్యోగాలు
ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2206 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఏసీ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్ వంటి ట్రేడ్‌లు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. దరఖాస్తు చేసే వారు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 15 నుంచి 24సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 5గా నిర్ణయించారు.