Skip to main content

DDU-GKY: నిరుద్యోగ యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని స్వామి రామా నందతీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, హాస్టల్‌ (భోజన వసతితో పాటు) ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు.
DDU-GKY
నిరుద్యోగ యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ

దీన్ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) కింద ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణలో భాగంగా అర్హులు, ఆసక్తి కలిగిన గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నారు. టెన్త్‌ పాసైన వారికి ఆటోమొబైల్‌–2, 3 వీలర్‌ సరీ్వసింగ్‌ ఇంకా సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్‌ వస్తువుల రిపేర్‌.. పదవ తరగతి పాసై ఐటీఐ చేసిన వారికి ప్రాధాన్యతనిచ్చే ఎల్రక్టీషియన్ (డొమిస్టిక్‌), సోలార్‌ సిస్టమ్‌ ఇన్ స్టాలేషన్, సర్వీస్‌.. బీకామ్‌ పాసైన వారికి ఎకౌంట్స్‌ అసిస్టెంట్‌ (ట్యాలీ).. ఇంటర్‌ వారికి కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసిస్టెంట్, టెన్త్‌ పాస్‌ లేదా ఫెయిలైన వారికి టైలరింగ్‌లో శిక్షణనిస్తారు. ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ గ్రామంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఇతర వివరాలకు 91339 08000, 91339 08111, 913390 8222, 99484 66111 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఈ సంస్థ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హతలు

  • వయసు 18–35 ఏళ్ల మధ్యలో ఉండాలి
  • గ్రామీణ ప్రాంత అభ్యర్థులే అయిఉండాలి
  • ప్రస్తుతం చదువుకుంటున్న వారు అర్హులు కాదు 
  • అర్హత గల వారు ఒరిజనల్‌ సర్లిఫికెట్లు, వాటి జిరాక్స్‌ సెట్, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు తీసుకురావాలి 
  • ఎంపికైన వారు రూ.250 రిఫండబుల్‌ డిపాజిట్‌ కట్టాలి

చదవండి:

ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణ!

KNRUHS: ఈ ప్రకారమే మెడికల్ సీట్ల కేటాయింపు

Minister of Education: విద్యార్థుల్లో విశ్వాసం పెంచేలా ఉన్నత విద్య

Published date : 17 Feb 2022 05:38PM

Photo Stories