Skip to main content

Minister of Education: విద్యార్థుల్లో విశ్వాసం పెంచేలా ఉన్నత విద్య

విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచే దిశగా బోధన ప్రణాళిక ఉండాలని విశ్వవి ద్యాలయాలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సూచించారు.
sabitha
వీసీల సమావేశంలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి

చదువు ముగిసిన వెంటనే ఉపాధి పొందగలమన్న ధీమా వారిలో కల్పించాల న్నారు. నగరంలోని డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఫిబ్రవరి 16న యూనివ ర్సిటీల వైస్‌ చాన్స్ లర్ల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య, పరిశోధనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే ఉన్నత విద్య ప్రామాణికత పెరుగుతుం దని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ముఖ్యమైన పరిశోధన కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి శాస్త్రీయ సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాలతో యూనివర్సిటీలు సరైన అనుసంధానం కలిగి ఉండాలని తెలిపారు. ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రంగంలో పరిశోధనలు చేపట్టేందుకు వీలుగా సంబంధిత పరిశ్రమలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని సబిత గుర్తుచేశారు. విద్యార్థులకు మెరుగైన ఉపాధి లభించేలా శిక్షణ కోసం వర్సిటీల్లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే వీలుందని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వీసీలను ఆమె కోరారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వర్సిటీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశోధనల వైపు విద్యా ర్థులను ఆకర్షితులను చేసేందుకు అవసరమైన పత్రికలను అందు బాటులో ఉంచాలని ఆదే శించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీ ప్‌కుమార్‌ సుల్తానియా, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, వీసీ వెంకటరమణ, సెక్రటరీ శ్రీనివాస్, ఇంటర్‌ బోర్డ్‌ కమిషనర్‌ ఉమర్‌ జలీల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఈ ఆఫీస్‌’ అప్లికేషన్ ను మంత్రి ప్రారంభించారు.

చదవండి: 

Janaka Pushpanathan: ఈ రాష్ట్ర‌ ఉన్నత విద్యామండలి కృషి భేష్‌

Higher Education: నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు కృషి

డిగ్రీ కొత్త పాఠ్య ప్రణాళిక.. ఉపాధి మార్గాలే ఎజెండా..

TSCHE: తెలంగాణ సెట్స్ 2022 - 23 కన్వీనర్లు ఖరారు

Published date : 17 Feb 2022 03:52PM

Photo Stories