డిగ్రీ కొత్త పాఠ్య ప్రణాళిక.. ఉపాధి మార్గాలే ఎజెండా..
డిగ్రీ కోర్సుల పాఠ్య ప్రణాళికను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకు బ్రిటిష్ కౌన్సిల్ సహాయం తీసుకుంటోది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన బంగర్, అబరిస్ట్ విత్ విశ్వవిద్యాలయాలతో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో జనవరి 13న యూకే యూనివర్సిటీల ప్రతినిధులతో ఉన్నత విద్యామండలి వర్చువల్ విధానంలో సమావేశమైంది. ఉన్నత ప్రమాణాలతో 2023 మే నాటికి సరికొత్త పాఠ్య ప్రణాళిక అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానించారు. వివరాలను మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మీడియాకు వివరించారు. డిగ్రీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోందని, అందులో ఎక్కువమంది బడుగు బలహీనవర్గాల విద్యార్థులే ఉన్నా రని తెలిపారు. కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఎంతమంది ఉపాధి మార్గాల వైపు వెళ్తున్నారనేది ముఖ్య మన్నారు. ప్రపంచ మార్కెట్ స్థాయిలో పాఠ్య ప్రణాళిక ఉంటేనే ఆ లక్ష్యాలు చేరుకోవడం సాధ్య మని, ఆ దిశగా మార్పులు చేస్తున్నామని చెప్పారు.