Skip to main content

Higher Education: నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు కృషి

హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ఓ ఉద్యోగి తెలంగాణలో పేరున్న యూనివర్సిటీ నుంచి బీటెక్‌ చేసినట్టు సర్టిఫికెట్‌ సమర్పించాడు. దీనిపై థర్డ్‌పార్టీ విచారణ చేయించిన ఆ కంపెనీ అది నకిలీదని తెలుసుకుంది. సదరు వర్సిటీ దీన్ని పరిశీ లించి, కంపెనీకి రిపోర్టు ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది. అప్పటికే ఆ ఉద్యోగి అక్కడ పనిచేసిన అనుభవంతో వేరే కంపె నీలో చేరాడు. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్‌లోని పాతబస్తీలో అది తయారైనట్టు తేల్చారు. అప్పటికే ఆ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చే వ్యక్తి మకాం మార్చాడు. దీంతో కేసు పెండింగ్‌లో పడింది.
r limbadri
– ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్)

తెలంగాణ‌ రాష్ట్రంలో ఏటా అన్ని యూనివర్సిటీల నుంచి 20కి పైగా నకిలీ సర్టిఫికెట్లను గుర్తిస్తున్నారు. ఇవి కేవలం దర్యాప్తు సంస్థల దృష్టికొచ్చినవే. అంతకన్నా ఎన్నో రెట్లు నకిలీలు పుట్టుకొస్తున్నాయని పోలీసు వర్గాలు సైతం ఒప్పుకుంటున్నాయి. ఫిర్యాదులు లేకపోవడంతో ఇవి వెలుగులోకి రావడంలేదు. కేవలం ఒక కంప్యూటర్, కొద్ది పాటి టెక్నాలజీతోనే అన్ని వర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు చేస్తున్నట్టు ఇటీవల ఉన్నత విద్యామండలి దృష్టికొచ్చింది. పలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కూడా నకిలీ సర్టిఫికెట్లతో అధ్యాపకులుగా చెలామణి అవుతున్నారనే ఆరోపణ లున్నాయి. వాటిని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడం పెను సమస్యగా మారింది.

కళ్లు తెరిచిన అధికారులు

నకిలీ ధ్రువపత్రాలను అడ్డుకునేందుకు ఉన్నత విద్యామండలి, పోలీసు యంత్రాంగం సంయుక్తంగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత నెల డీజీపీ మహేందర్‌ రెడ్డి సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. వీటిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొం దించాలని నిర్ణయించారు. అన్ని వర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సంప్రదింపులు జరుపు తోంది. సర్టిఫికెట్‌ అసలుదా? నకిలీదా? తేల్చడా నికి ఇప్పటివరకూ వర్సిటీ సిబ్బంది మాత్రమే పరిశీలించాల్సి వస్తోంది. విశ్వవిద్యాలయాల్లో అంతంత మాత్రంగా ఉన్న సిబ్బంది కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈలోగా నకిలీల ముఠా యథేచ్ఛగా దందా కొనసాగిస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్లు, రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్, ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకునే వాళ్లు నకిలీ సర్టిఫికెట్లనే ఆశ్రయిస్తున్నారని అధికారులు అంటు న్నారు. దీన్ని అడ్డుకోవడానికి కంపెనీలు నేరుగా తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు.

కట్టడి ఇలా...

  • అన్ని విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్ లైన్ లో అప్‌లోడ్‌ చేస్తారు. ఇందుకు సంబం« దించిన సర్వర్‌ రాష్ట్ర అధికారుల పర్యవే క్షణలో ఉంటుంది. దీనిద్వారా ప్రతీ కంపెనీ అభ్యర్థి సర్టిఫికెట్లు అసలువో, నకిలీవో తెలుసుకోవచ్చు.
  • అన్ని భద్రతా చర్యలు తీసుకుని సాఫ్ట్‌వేర్‌ ను రూపొందించాలని భావిస్తున్నారు. సంబంధిత కంపెనీలు ఆ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి దాని సరిఫ్టికెట్‌ స్థితిగతులు తెలుసుకోవచ్చు.
  • కొన్ని సందర్భాల్లో విధిగా సంబంధిత వర్సిటీలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఆయా కంపెనీలు వర్సిటీ అధికారులను సంప్రదించాలి.
  • పోలీసుల భాగస్వామ్యం కూడా ఉండే ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నకిలీ సర్టిఫికెట్లు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు. వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు.

మంచి ప్రయోగం

నకిలీ సర్టిఫికెట్లను అడ్డుకునేందుకు ఉన్నత విద్యామండలి కృషి చేస్తోంది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ ఎలా రూపొందించాలి? ఎలాంటి మెళకువలు అవసరమనే దానిపై డీజీపీతో జరిగిన సమావేశంలో చర్చించాం. త్వరలోనే ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నందున కచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. 
– ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్)

చదవండి:

డిగ్రీ కొత్త పాఠ్య ప్రణాళిక.. ఉపాధి మార్గాలే ఎజెండా..

TSCHE: తెలంగాణ సెట్స్ 2022 - 23 కన్వీనర్లు ఖరారు

Higher Education: ఉమ్మడి పీజీకి ఓకే

Published date : 28 Jan 2022 07:44PM

Photo Stories