రాష్ట్రంలో ఉమ్మడి పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల అకడమిక్ క్యాలండర్ రూప కల్పన కసరత్తు తుది దశకు చేరింది.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి
ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో చర్చిం చి, వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకు న్నారు. ఏకాభిప్రాయంతో ముందు కెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఉమ్మడి పీజీ వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి డిసెంబర్ 13న స్పష్టం చేశారు. ఇప్పటివరకూ యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల ప్రవే శాలు, బోధన విధానం, పరీక్షల నిర్వహణ వేర్వేరుగా ఉంటున్నాయి. ఉమ్మడి విధానం అమల్లోకి వస్తే ప్రవేశాలు మొదలు ఫలితాల వరకూ ఒకే తేదీలుంటాయి. వర్సిటీలే విద్యా ర్థులకు పరీక్షలు నిర్వహిస్తాయి. మూల్యాంకన ప్రక్రియ చేపడతాయి. వీటన్నింటినీ ఉన్నత విద్యామండలి సమ న్వయం చేస్తుంది.