Skip to main content

Higher Education: అనివార్యమైతే ఆన్ లైన్‌ బోధన

తప్పని పరిస్థితుల్లో ఆన్ లైన్ బోధన దిశగా సమాయత్తమవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది.
Higher Education
అనివార్యమైతే ఆన్ లైన్‌ బోధన

ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలు మొదలవుతున్న నేపథ్యంలో మండలి కార్యాలయంలో విశ్వవిద్యాలయాల వైస్‌ చా¯Œ్సలర్లతో చైర్మన్ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి భేటీ అయ్యారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచు కుని కాలేజీల్లో అవసరమైన రక్షణ చర్యలు చేపట్టా లని సూచించారు. ప్రతి కాలేజీలోనూ కరోనా సహాయ కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోధన, బోధనేతర సిబ్బందిలో ఎంత మందికి వ్యాక్సినేషన్ జరిగిందనే వివరాలు పంపా లని వీసీలను కోరారు. కాలేజీల్లో ప్రత్యేకంగా క్యాం పులు నిర్వహించి విద్యార్థులు, సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని సూచించారు. కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా ఆన్ లైన్ విద్యాబోధనకే విద్యార్థులు అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష బోధనకు వస్తున్న విద్యా ర్థుల మానసిక స్థితిని అంచనా వేయాలని కోరారు. వారి మానసిక స్థితిని మెరుగుపర్చేందుకు కాలేజీల్లో విధిగా మెంటార్స్‌ను ఏర్పాటు చేయాలని, మెంటర్‌ నంబర్‌ను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కాలేజీల్లో ర్యాగింగ్‌ నిరోధానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వీసీలకు లింబాద్రి సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే తీసుకునే చట్టపరమైన చర్యలపై విద్యార్థులకు అవగాహన కలి్పంచాలని చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

పీజీ కోర్సులకు ఉమ్మడి అకడమిక్‌ ప్లానింగ్‌

ఇప్పటివరకు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకే అమ లవుతున్న ఉమ్మడి అకడమిక్‌ ప్లానింగ్‌ను పోస్టు–గ్రాడ్యుయేట్‌ కోర్సులకు అమలు చేయాలని నిర్ణయించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక, ఒకే తేదీల్లో బోధన, పరీక్షల విధానం, పాలనాపరమైన పద్ధతులు ఉం డేలా చూడటం ఇందులోని ప్రధానాంశం.

న్యాక్‌ గుర్తింపుపై దృష్టి

న్యాక్‌ గుర్తింపు సాధనపై మరింత దృష్టి సారించాల ని నిర్ణయించారు. ఇంజనీరింగ్‌లో అటానమస్‌ కాలేజీలు న్యాక్‌ ప్రమాణాలు పాటిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో 1,040 డిగ్రీ కాలేజీలు ఉంటే, కేవలం 88 మాత్రమే న్యాక్‌ గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యాక్‌ గుర్తింపు కోసం ముందుకొచ్చే కాలేజీలకు రూ.లక్ష ప్రోత్సాహకం అందిస్తామని ఉన్నత విద్యామండలి ఇది వరకే ప్రకటించింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఎక్కువ కాలేజీలు న్యాక్‌ గుర్తింపుకు దరఖాస్తు చేసేలా చూడాలని నిర్ణయించారు.

13న మళ్లీ భేటీ

వీసీలతో డిసెంబర్‌ 13న మరోసారి సమావేశం కానున్నట్టు ప్రొఫెసర్‌ లింబాద్రి మీడియాకు తెలి పారు. అందులో పీజీ కాలేజీలకు ఉమ్మడి అకడమిక్‌ ప్లానింగ్‌పై ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు. డిసెంబర్‌ 1వ తేదీన తరగతులు మొదలైన తర్వాత కాలేజీల్లో పరిస్థితిపై ఈ భేటీలో చర్చిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ప్రత్యక్ష బోధనే జరుగుతుందని అన్నారు.

చదవండి: 

Higher Education: ఉన్నత విద్య కోర్సుల్లో సమ్మర్‌ స్కూల్‌ కాన్సెప్‌

Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!

Higher Education: అత్యున్నత ప్రమాణాలతో ఉన్నత విద్య.. సీఎం ఆకాంక్ష

Published date : 01 Dec 2021 06:08PM

Photo Stories