Higher Education: అత్యున్నత ప్రమాణాలతో ఉన్నత విద్య.. సీఎం ఆకాంక్ష
అత్యున్నత ప్రమాణాలతో ఉన్నత విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్ధులకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ అందించడం, సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థతో ఉన్నత విద్యామండలి ఒప్పందం చేసుకుని 1.62 లక్షల మంది విద్యార్థ్ధులకు సాఫ్ట్ స్కిల్స్‌పై సర్టిఫికేషన్ కోర్సులు అందించనుంది. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ అంటే వీసా లాంటిది. ఇలాంటి శిక్షణ దేశంలోనే ప్రథమం. ఇతర రాష్ట్రాల్లో లెర్నింగ్ రిసోర్సులపై శిక్షణ ఇస్తున్నా అకడమిక్‌లో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోసం సర్టిఫికేషన్ కోర్సులో శిక్షణ అందించటాన్ని రాష్ట్రంలోనే అమలు చేస్తున్నాం. ఈ శిక్షణ ఉచితంగా అందుతుంది. ఇందుకు ప్రభుత్వం రూ.30 కోట్లు వెచ్చిస్తోంది. 2019–20లో ఏపీలోని విద్యార్థులలో 39 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలిగాం. 2020–21లో 50 వేల మందికి అవకాశాలు దక్కాయి. 2021లో లక్ష మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.
చదవండి:
Good News: విద్యార్ధులకు నైపుణ్యాలను పెంపొందించేలా ఉచిత శిక్షణ
Study Material: పరీక్షకు పరేషానొద్దు..స్టడీమెటీరియల్ ఆవిష్కరణ..