Skip to main content

Study Material: పరీక్షకు పరేషానొద్దు..స్టడీమెటీరియల్ ఆవిష్కరణ..

అక్టోబర్‌ 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్‌ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొని ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.
Study Material
పరీక్షకు పరేషానొద్దు..స్టడీమెటీరియల్ ఆవిష్కరణ..

విద్యార్థులు ఒత్తిడిని తట్టుకునేందుకు, వార్షిక పరీక్షను విజయవంతంగా రాసేందుకు ఉపయుక్తమైన ఫస్టియర్‌ స్టడీమెటీరియల్‌ను మంత్రి అక్టోబర్‌ 12న తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారితో స్టడీ మెటీరియల్‌ రూపొందించామని ఆమె వెల్లడించారు. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రం, చరిత్ర స్టడీ మెటీరియల్‌ను ‘టీఎస్‌బీఐఈ’వెబ్‌సైట్‌లో పొందొచ్చని తెలిపారు. మిగతా సబ్జెక్టులను రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని వివరించారు. కోవిడ్‌ కారణంగా ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతికి పంపిన విషయం తెలిసిందే. వారికి ద్వితీయ సంవత్సరం మధ్యలో గత వార్షిక పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో 50 శాతం చాయస్‌ ఇస్తూ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్‌ ఉమర్‌ జలీల్‌ పాల్గొన్నారు. 

చదవండి: 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా చేరాలనుకునే అభ్యర్థులకు యూజీసీ తీపి కబురు..

కొత్త సైనిక పాఠశాలలకు ఆమోదం

Published date : 13 Oct 2021 04:25PM

Photo Stories