Om Prakash Chautala: 87 ఏళ్ళ వయసులో 10, 12 తరగతులలో ఉత్తీర్ణత
Sakshi Education
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా మే 10న 87 ఏళ్ల వయసులో 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణత సాధించారు.
చండీగఢ్‌లో హర్యానా ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు ఆయనకు మార్కుల పత్రాలను అందజేశారు. 2021లో, ఓం ప్రకాష్ చౌతాలా హర్యానా ఓపెన్ బోర్డ్ కింద 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అయినప్పటికీ, అయన ఇంకా 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించనందున ఫలితం ఆగష్టు 5 న నిలిపివేయబడింది. 2021లో 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షలో చౌతాలా ఇంగ్లిష్ పేపర్‌లో 100కి 88 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడని గుర్తు చేశారు.
Published date : 11 May 2022 04:28PM