Governor: విద్యా బోధన, పరీక్షలపై దృష్టి సారించండి
Sakshi Education
కరోనా పరిస్థితులు కుదుటపడుతున్నం దున విద్యా బోధన, పరీక్షల నిర్వహణపై దృష్టి సారించాలని ఆంధ్ర్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వర్సిటీల వీసీలను ఆదేశించారు.
వర్సిటీల వీసీలతో గవర్నర్ విజయవాడ రాజ్‌భవన్ లో ఫిబ్రవరి 23న సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ వర్సిటీలు పూర్తిస్థాయిలో పనిచేయాలని చెప్పారు. అనంతరం గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసో డియా వీసీలతో సవివరంగా చర్చించారు.
చదవండి:
అందరికీ ఉన్నత విద్య అందించడమే లక్ష్యం: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
Published date : 24 Feb 2022 03:21PM