Skip to main content

DYEO Posts: నేడు డీవైఈఓ పోస్టుల‌కు ప‌రీక్ష‌..

ఏపీపీఎస్‌సీ (డీవైఈఓ) పోస్టుల పరీక్షలకు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని డీఆర్‌ఓ పుల్లయ్య స్పష్టం చేశారు.
DRO Pullaiah Clarifies Exam Rules  Strict No Tolerance for Late Candidates  Exam for Deputy Education Officer posts today  AP Public Service Commission DYEO Post Exams

చిత్తూరు: నేడు నిర్వహించే ఏపీపీఎస్‌సీ (డీవైఈఓ) పోస్టుల పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. జిల్లాలోని 3 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు పరీక్ష కేంద్రాల్లో 730 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు.

New Courses in SKU: టెక్నాలజీ విప్లవంతో సరికొత్త ఉపాధి అవకాశాలు

ఇంజ‌నీరింగ్ కళాశాల‌ల్లో..

చిత్తూరు పరిధిలోని సీతమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంలో 150 మంది, పూతలపట్టు మండలం వేము ఇంజినీరింగ్‌ కళాశాలలో 330 మంది, పలమనేరు మండలం మధర్‌థెరిస్సా ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంలో 250 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు జరుగుతుందన్నా రు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల మధ్యలో చేరుకోవాలన్నారు. పరీక్ష రాసే వారిలో దివ్యాంగులున్నట్‌లైతే తనకంటే తక్కువ విద్యార్హత ఉన్న వారిని సహయకులుగా వెంట తీసుకురావచ్చన్నారు.

TS Polycet 2024 Counselling Dates : టీఎస్ పాలిసెట్-2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇదే.. రిజ‌ల్డ్స్ ఎప్పుడంటే..?

అనుమ‌తి లేదు..

పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించరని తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హాల్‌టికెట్‌, గుర్తింపుకార్డు, వాటర్‌బాటిల్‌ మాత్రమే లోనికి అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు కేశవమూర్తి, కేశవులు, శిరీష, కులాయప్ప, ఉమామహేశ్వర్‌రెడ్డి, కలెక్టరేట్‌ సీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ గుణశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

AP SET Results 2024 Link : ఏపీ సెట్‌ ఫలితాలు విడుదల.. కటాఫ్‌ మార్కుల కోసం క్లిక్‌ చేయండి

Published date : 25 May 2024 12:07PM

Photo Stories