AP Tenth Supplementary Exams: నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే!
అమరావతి: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ఫెయిలైన మొత్తం 1,61,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు పదో తరగతి పరీక్షల విభాగం ప్రకటించింది. వీరిలో 96,938 మంది బాలురు కాగా.. 64,939 మంది బాలికలు ఉన్నారు. శుక్రవారం అంటే నేటి నుంచి జూన్ 3వ తేదీ వరకు మొత్తం 9 రోజులపాటు జరిగే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రెగ్యులర్ పరీక్షల మాదిరగానే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు.
NDA and NA(2) Notification: ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2) నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హతతో దరఖాస్తులకు అవకాశం!
పర్యవేక్షణకు 685 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 685 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలను ‘నో ఫోన్ జోన్’ గా ప్రకటించామని, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ప్రకటించారు. డీఈవోల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ముగిసేవరకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల డైరెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, పరీక్షలపై ఎలాంటి సందేహాలున్నా 0866–2974540 నంబర్‌లో సంప్రదించాలని దేవానందరెడ్డి సూచించారు.
Staff Nurse: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకాలు.. మూడు నెలలైనా అందని మొదటి జీతం
పరీక్షల షెడ్యూల్ ఇదీ..
24–5–2024 తెలుగు
25–5–2024 హిందీ
27–5–2024 ఇంగ్లిష్
28–5–2024 లెక్కలు
29–5–2024 ఫిజికల్ సైన్స్
30–5–2024 బయలాజికల్ సైన్స్
31–5–2024 సోషల్ స్టడీస్
01–6–2024 ఓఎస్‌ఎస్‌సీ పేపర్–1
03–6–2024 ఓఎస్‌ఎస్‌సీ పేపర్–2
PG Diploma Courses: షుగర్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా కోర్సులు.. దరఖాస్తులకు చివరి తేదీ..!