Tenth Student of Maharashtra Story: పది ప్రయత్నాల తరువాత 10వ తరగతి పాస్ అయిన మహారాష్ట్ర విద్యార్థి..
సాక్షి ఎడ్యుకేషన్: ఎంతోమంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తారు. అందులో కొందరు ఫెయిల్ అయ్యే విద్యార్థులూ ఉంటారు.. అయితే, వారిలో కొందరు తిరిగి పరీక్ష రాసేందుకు సిద్ధమైతే, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడతారు. కాని, ఏమాత్రం తప్పుడు ఆలోచనలు లేకుండా తిరిగి ఎన్ని ప్రయత్నాలైన చేసి పాస్ అవ్వాలని పదో తరగతి పరీక్షలను పది సార్లు రాసారు మహారాష్ట్రకు చెందిన ఈ విద్యార్థి..
మహారాష్ట్రకు చెందిన విద్యార్థి కృష్ణ నామ్‌దేవ్. పర్లి తాలూకాలోని రత్నేశ్వర్ పాఠశాలలో పదో తరగతి చదివిన ఈ విద్యార్థి గత ఐదు సంవత్సరాలుగా నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తన తండ్రి నామ్‌దేవ్ ముందే ఇచ్చిన సమాచారం ప్రకారం కృష్ణ నామ్‌దేవ్ ముందే తాను చేసిన ఆ పది ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాని, తన కొడుకుకి తాను ప్రతీ అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో కృష్ణను ప్రోత్సాహిస్తూనే వచ్చాడు. ఒక ప్రయత్నంలోనే అనుకున్న దానికన్న తక్కువ మార్కులు వస్తే వారి పిల్లలను తిడుతూ, మరొకరితో పోల్చడం చేయకుండా, ఖచ్చింతా పాస్ కావాలని, లేదా ఫస్ట్ క్లాస్ రావాలని తపన పడడం కాకుండా.. తన కొడుకులో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఎన్ని ప్రయత్నాలైనా చేసి చివరికి పాస్ అవ్వాలని ప్రోత్సాహించారు కృష్ణ తండ్రి.
Ramchandra Aggarwal Sucess Story: వైకల్యంతో నడవలేని స్థితి, వందల కోట్ల వ్యాపారవేత్తగా విజయం..
సోమవారం మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన పదో తరగతి ఫలితాల అనుసారం కృష్ణ తన 11వ ప్రయత్నంలో పాస్ అయ్యాడు అని తేలింది. దీంతో తన ఊరి ప్రజలంతా తనకు ఘనంగా అభినందనలు తెలిపారు. తన కొడుకు తాను చేసిన పదకొండవ ప్రయత్నంలో ఫలించాడని గర్వపడ్డాడు కృష్ణ తండ్రి నామ్‌దేవ్ ముందే.
Tags
- tenth student story
- Board Exams
- Maharashtra Student Successful attempt
- Krishna Namdev Munde
- Maharashtra State Board of Secondary and Higher Education
- maharashtra tenth board results 2024
- 11th attempt successful
- parents encouragement
- 10 attempts for tenth board exam
- students success
- tenth student inspiring story
- Education News
- Sakshi Education News
- Success story latest
- tenth students results 2024
- maharashtra student tenth story
- Maharashtra
- Exams
- Failure
- sakshieducation success stories
- parents support