Tenth Topper Riya Sree: టెన్త్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని
Sakshi Education
మనలో ఎన్ని లోపాలు ఉన్నా సాధించాలన్న తపన ఉంటే ఎంతటి స్థాయికైనా ఎదుగుతాం అని ఈ విద్యార్థిని నిరూపించింది..
విడుదల చేసిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో 470 మార్కులు సాధించింది ఓ విద్యార్థిని. తను హోసూరు సమీపంలోని నెల్లూరు హైస్కూల్‌లో మొదటి స్థానంలో నిలిచింది. అలా నిలిచిన ఆమె ఒక అంధ విద్యార్థిని. తనే, రియాశ్రీ. తన లోపంతో బాధపడకుండా, సాధించాలని చదివింది. చివరికి స్కూల్‌లో టాపర్‌గా సాధించింది. ఈ మెరకు తనని అందరూ అభినందించారు.
Telangana University: వర్సిటీలో నూతన హాస్టళ్లు నిర్మించాలి
హోసూరు ట్రెంట్ సిటీ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అఖిలన్, సుమతి దంపతుల కూతురు రియాశ్రీ. తన బాల్యంలోనే కంటి చూపును కోల్పోయింది. అయినప్పటికీ చదువులో మేటిగా రాణిస్తోంది. టెన్త్‌లో పాఠశాలలో ప్రథమురాలిగా నిలిచింది. సబ్ కలెక్టర్ శరణ్య బాలిక రియాశ్రీని అభినందించారు. తమ కూతురికి కంటి చూపు వచ్చేలా చేయాలని తల్లిదండ్రులు విన్నవించారు.
Published date : 18 Dec 2023 11:09AM