Telangana University: వర్సిటీలో నూతన హాస్టళ్లు నిర్మించాలి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మెయి న్ క్యాంపస్‌లో బాలికలకు, పీహెచ్‌డీ స్కాలర్స్‌కు ఒ క్కో హాస్టల్, సారంగపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో బీఈడీ విద్యార్థులకు ఒక హాస్టల్‌ను వెంటనే నిర్మించాలని వర్సిటీ పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి జయంతి డిమాండ్ చేశారు. శుక్రవారం తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెయూలో బాలికలకు ఒకే హాస్టల్ ఉండటంతో సుమారు 500 మంది విద్యార్థినులకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ఒక్కో రూంలో 8– 10 మంది విద్యార్థినులు ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్‌డీ స్కాలర్స్‌కు కూడా హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే సారంగపూర్ బీఈడీ కాలేజ్‌లో సీట్లు వచ్చిన కొందరు గ్రామీణ ప్రాంత విద్యార్థులు హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో తమ అడ్మిషన్స్ రద్దు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి బాలిక లు, స్కాలర్స్, బీఈడీ విద్యార్థుల కోసం కొత్త హాస్టల్స్‌ను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ నాయకులు ప్రిన్స్, దేవి క, ఆకాష్, అక్షయ్, మోహిత్, హన్మాండ్లు, లహరి పాల్గొన్నారు.