Skip to main content

Certificate Course Exam : వైవీయూలో స‌ర్టిఫికెట్ కోర్సుల‌కు వార్షిక ప‌రీక్ష‌లు ప్రారంభం..

Annual exams for certificate courses at Yogi Vemana University

వైవీయూ: యోగివేమన యూనివర్సిటీ, లలితకళల విభాగం నిర్వహిస్తున్న నృత్యం, కీ బోర్డు, కర్ణాటక సంగీతంలో సర్టిఫికెట్‌ కోర్సులకు వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలను అందరికీ అందుబాటులో ఉండేటట్లు శ్రీహరి డిగ్రీ కాలేజ్‌లో నిర్వహిస్తున్నారు. సుమారు 100 మంది పరీక్షకు హాజరు అయ్యారు. ఆ విభాగాధిపతి డాక్టర్‌. కే. మృత్యుంజయరావు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య ఎస్‌. రఘునాథ రెడ్డి పరీక్ష కేంద్రాన్ని, నిర్వహణ తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసు కొన్నారు.

Free Coaching : సెకండరీ గ్రేడ్‌ టీచర్ పరీక్ష‌కు ఉచిత శిక్ష‌ణ‌..

Published date : 05 Jul 2024 10:16AM

Photo Stories