Skip to main content

అందరికీ ఉన్నత విద్య అందించడమే లక్ష్యం: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్

సాక్షి, అమరావతి: అందరికీ ఉన్నత విద్య అందించేందుకు నూతన విద్యా విధానాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.
‘కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యావిధానం-2020’ అనే అంశంపై చర్చించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా సోమవారం సదస్సు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పాల్గొని మాట్లాడారు. గవర్నర్ ఇంకా ఏమన్నారంటే..
  • నూతన విద్యా విధానం అమలు కోసం మార్గదర్శకాలను సూచించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
  • పరిశోధనల్లో నాణ్యత, నవ్యతతోపాటు పేటెంట్ ఆధారిత పరిశోధనల, మేథో సంపత్తి హక్కులను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యమిస్తోంది.
  • అందుకోసం జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థతో రాష్ట్రంలోని వర్సిటీల తరఫున ఒప్పందం కుదుర్చుకుంది.
  • పరిశోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర పరిశోధనల మండలిని ఏర్పాటు చేస్తోంది. విద్యా సంస్థలను పరిశ్రమలతో అనుసంధానించనుంది.
Published date : 08 Sep 2020 06:46PM

Photo Stories