Skip to main content

Green Skills Academy: భారతదేశంలో మొదటి గ్రీన్ స్కిల్స్ అకాడమీ.. హైదరాబాద్‌లో

భారతదేశంలో మొదటి గ్రీన్ స్కిల్స్ అకాడమీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు 1యం1బి ఫౌండేషన్ (వన్ మిలియన్ వన్ బిలియన్)తో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ విభాగం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది.
First Green Skills Academy in India

 తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని కళాశాల యువతలో గ్రీన్ స్కిల్స్‌ను పెంపొందించటం మరియు తెలంగాణ నుండి 1 మిలియన్ యువతకు 2030 నాటికి శిక్షణ ఇవ్వడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. అలాగే వీరిలో నుండి టాప్ 10 యువతను, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో ప్రతి సంవత్సరం 1యం1బి నిర్వహించే వార్షిక సమ్మిట్‌లో తమ స్కిల్స్ ను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తారు.

చదవండి:

Job Mela: నేడు రీజినల్‌ జాబ్‌ మేళా.. నెలకు రూ.60,000 వ‌ర‌కు జీతం..

Free training in computer courses: కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

Published date : 05 Feb 2024 05:55PM

Photo Stories