Job Mela: నేడు రీజినల్ జాబ్ మేళా.. నెలకు రూ.60,000 వరకు జీతం..
ఈ జాబ్ మేళాలో 87 బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, టూరిజం –హాస్పిటాలిటీ, రిటైల్, మార్కెటింగ్, లాజిస్టిక్స్, రిటైల్ జ్యువలరీ విభాగాల్లో సుమారు 5,892 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. విశాఖపట్నం జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులు హాజరు కావాలని, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల నైపుణ్యాల ఆధారంగా రూ.15,000 నుంచి రూ.60,000 వేల వరకు వేతనాలు ఉంటాయన్నారు.
చదవండి: Free training courses: ఉపాధి ఆధారిత కోర్సుల్లో ఉచిత శిక్షణ
2న జిల్లా ఉపాధి కార్యాలయంలో..
కంచరపాలెం: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీయర్ సర్వీస్ సెంటర్‌లో కర్లికల్, టెక్నికల్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారి సిహెచ్.సుబ్బిరెడ్డి(క్లరికల్) ఒక ప్రకటనలో తెలిపారు. డాన్ బోస్కో, మెడిప్లస్, సువర్ణభూమి, బిగ్ బాస్కెట్, కెఎఫ్‌సీ, ఆర్‌కె హాస్పిటల్, హెటిరో డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో 477 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. జూనియర్ కెమిస్ట్, రిటైల్ ట్రైనింగ్ అసోసియేట్, ఫార్మసిస్ట్, జూనియర్ ట్రైనీ, డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఆఫీస్ అసిస్టెంట్, అకౌంట్స్, టెలికాలర్, అసిస్టెంట్, రికవరీ, క్లర్కు, బ్రాంచ్ ఇన్‌చార్జి ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తిచేసిన 18–45 ఏళ్ల మధ్య వయసు గల పురుష, మహిళా అభ్యర్ధులు అర్హులన్నారు. ఆయా ఉద్యోగాలను బట్టి జీతం నెలకు రూ.11,000 నుంచి రూ.25,500ల వరకు ఉంటుందన్నారు.