Fee Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి..
జూలై 12న పలు కళాశాలల్లో తరగతులు బహిష్కరించి పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ ముట్టడించారు. ప్రభుత్వాలు మారినా పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజులు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరేళ్లుగా పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. సంవత్సరానికి 14లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.8214.57 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నా రు.
తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు.
కార్యక్రమంలో నాయకులు జూలపల్లి మనోజ్, కుర్ర రాకేష్, కుర్ర రాకేశ్, కళ్యాణ్, అభిషేక్, సాత్విక్, శ్రీకాంత్, హేమంత్, అశోక్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.