Eye Disease: విద్యాసంస్థలు, వసతిగృహాల్లో వేగంగా వ్యాప్తి.. పెరుగుతున్న కేసులు
చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు వ్యాధి బారిన పడుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి సోకే లక్షణం ఉండడంతో ముఖ్యంగా పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల్లో వి ద్యార్థులు కళ్ల కలక బారిన పడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది వ్యాధి బారిన పడి ఇ బ్బంది పడుతున్నారు.
కళ్లు ఎర్రగా మారడం, కంటి నుంచి నీరు కారడం, దురద, కంటి నొప్పి, కంటి రె ప్పలు అతుక్కుపోవడం, వాపు వంటి లక్షణాలతో ఇ బ్బందులు పడుతున్నారు. బ్యాక్టీరియా ద్వారా వ్యా ధి సోకిన వారికి ఐదురోజుల్లో నయమవుతుందని, వైరస్ కారణంగా వస్తే ఒకటి లేదా రెండు వారాల వరకు ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.
చదవండి: Eye Flu & Pink Eye: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా? వర్షాకాలంలోనే ఇవి వస‍్తాయా?
ఆస్పత్రులకు క్యూ...
కళ్ల కలక వ్యాధి బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఓపీ పెరుగుతోంది. భైంసా ఏరియాస్పత్రిలో రోజుకు 200 నుంచి 250 మంది కళ్ల కలక వ్యాధి బాధితులు వస్తున్నట్లు ఏరియాస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి సైతం రోజుకు వంద మంది కళ్ల కలక బాధితులు వస్తున్నారు. అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ అధికారులు అవసరమైన మందులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంటున్నారు.
చదవండి: KGBVలో 50మంది విద్యార్థినులకు కళ్ల కలక
ఆందోళన వద్దు...
కంటి కలక సాధారణ వ్యాధి. సోకినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వై ద్యుల సూచనల మే రకు జాగ్రత్తలు తీసుకోవాలి. వారం దాటినా తగ్గని పక్షంలో వైద్యులను సంప్రదించాలి. ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో యాంటిబయాటిక్ ఐడ్రాప్స్, లుబ్రికేటింగ్ ఐడ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ధన్‌రాజ్, డీఎంహెచ్‌వో
జాగ్రత్తలు తీసుకుంటున్నాం...
పాఠశాలల్లో విద్యార్థులు కళ్లకలక బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇదివరకే సోకిన విద్యార్థులను గుర్తించి ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. కేజీబీవీల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఐసోలేషన్ ఏర్పాట్లు చేస్తున్నాం.
– రవీందర్‌రెడ్డి, డీఈవో