Skip to main content

KGBVలో 50మంది విద్యార్థినులకు కళ్ల కలక

గార్ల: గార్లలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో సుమారు 50 మంది విద్యార్థినులకు కళ్ల కలక వ్యాధి సోకడంతో ముల్కనూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో జూలై 31న‌ వైద్యశిబిరం ఏర్పా టు చేశారు.
50 female students in kgbv eye infection
KGBVలో 50మంది విద్యార్థినులకు కళ్ల కలక

విద్యార్థినులకు డాక్టర్‌ నవీన్‌కుమార్‌ వైద్య పరీక్షలు చేసి కంటి చుక్కల మందును పంపిణీ చేశారు. కళ్ల కలక అంటు వ్యాధి అని, నివారణకు ప్రతీ ఒక్కరు చుక్కల మందు వాడాలన్నారు. మరొకరికి సోకకుండా కళ్లజోళ్లు పెట్టుకోవాలని సూచించారు. శిబిరంలో పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ ఉషారాణి, పీహెచ్‌సీ హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఇస్మాయిల్‌ బేగ్‌, అనీల, పార్వతి, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
చదవండి:

Teachers Association: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

English Medium: ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం

Published date : 01 Aug 2023 04:10PM

Photo Stories