Skip to main content

ANGRAU: ఎన్నారై కోటా సీట్లకు దరఖాస్తు గడువు పెంపు

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ(వ్యవసాయం), కమ్యూనిటీ సైన్సు కోర్సుల్లో ఎన్నారై కోటా సీట్ల భర్తీకి 2వ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ పి.సుధాకర్‌ సెప్టెంబర్‌ 22న ఓ ప్రకటనలో తెలిపారు.
Extension of application deadline for NRI quota seats
ఎన్నారై కోటా సీట్లకు దరఖాస్తు గడువు పెంపు

ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్‌ 10 వరకు గడువు పెంచినట్లు పేర్కొన్నారు. ఆయా కోర్సుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని.. నిర్ణీత గడువులోగా విశ్వవిద్యాలయానికి చేరేలా పంపించాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://angrau.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. 

చదవండి: 

ANGRAU: ఆన్‌లైన్‌లో వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సులు

Agricultural Education: డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Published date : 23 Sep 2022 04:03PM

Photo Stories