Certificate Courses: దూరవిద్య సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ద్వారా వ్యవసాయ విద్య విస్తృత వ్యాప్తికి సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించినట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్ట్రార్ డాక్టర్ కె.గురవారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తిగల రైతులు, మహిళలు, యువతకు 8 వారాలపాటు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే పలు కోర్సులను ఇప్పటికే ఏప్రిల్ నుంచి ప్రారంభించామని పేర్కొన్నారు. మిద్దె తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల తయారీ వంటి మూడు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని వివరించారు.
Gurukul Students Talent: బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్క్‌టెక్చర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ..
ఆసక్తిగల వారు రూ.1500 ఫీజు చెల్లించి జూన్ 20లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ను సందర్శించాలని, లేదా 8008788776, 8309626619, 8096085560 సెల్ నంబర్ల ద్వారా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ సంప్రదించవచ్చని వివరించారు.