ANGRAU: ఆన్‌లైన్‌లో వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులు
Sakshi Education
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం జూలై నుంచి 8 వారాల (2 నెలల) వ్యవధి గల ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వ్యవసాయ పీఠాధిపతి డాక్టర్ ఎ.ప్రతాప్‌కుమార్‌రెడ్డి జూన్ 13న ఒక ప్రకటనలో తెలిపారు.
సేంద్రియ వ్యవసాయం, మిద్దెతోటల పెంపకం, తేనెటీగల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తులకు విలువ జోడింపు, పుట్టగొడుగుల పెంపకం, పట్టు పురుగుల పెంపకం, వానపాముల ద్వారా ఎరువుల తయారీ తదితర సబ్జెక్టుల్లో ఈ ఆన్‌లైన్ కోర్సులు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒక్కో కోర్సుకు రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించి, పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావటానికి అభ్యర్థులు కంప్యూటర్/ఆండ్రాయిడ్ సెల్ ఫోన్/ఐపాడ్ సదుపాయం కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలు, పేర్ల నమోదుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ‘https://angrau.ac.in’ను సంప్రదించాలన్నారు. (లేదా) డాక్టర్ కేఎస్ పూర్ణిమ, సహ ఆచార్యులు, సార్వత్రిక దూరవిద్యా కేంద్రం, లాంఫాం, గుంటూరు, ఫోన్ నంబర్ 8008788776, 8309626619, 9110562727లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి:
Published date : 14 Jun 2022 01:47PM