‘ఐసీఏఆర్’ ర్యాంకింగ్స్ లో బెస్ట్ యూనివర్సిటీలు ఇవే
Sakshi Education
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ర్యాంకింగ్‌సలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీకి జాతీయ స్థాయిలో 13వ స్థానం లభించింది.
2019కి సంబంధించి దేశంలోని వ్యవసాయ యూనివర్శిటీల ర్యాంకింగ్‌సను ఐసీఏఆర్ డిసెంబర్ 5వ తేదీన విడుదల చేసింది. మొత్తం 67 వ్యవసాయ యూనివర్శిటీల్లో మొదటి స్థానంలో పంజాబ్ వ్యవసాయ యూనివర్శిటీ, రెండో స్థానంలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యూనివర్శిటీ, మూడో స్థానంలో ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ యూనివర్శిటీలు నిలిచాయి. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీ గతంలో 31వ స్థానంలో నిలువగా, ఈసారి 13వ స్థానానికి ఎగబాకింది. అదేవిధంగా ఐసీఏఆర్ ర్యాంకింగ్‌సలో ఏపీలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన వర్సిటీ 34వ ర్యాంకు, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 64వ ర్యాంకు సాధించాయి.
Published date : 07 Dec 2020 04:38PM