Skip to main content

TG Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై స్పష్టత.. మూల్యాంకనంలో పొరపాట్లు చేయొద్దు: కృష్ణ ఆదిత్య

సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్‌ మూల్యాంకన ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. విద్యార్థుల జవాబు పత్రాల స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సక్రమంగా పరిశీలన చేయాలని సూచించారు.
inter evaluation guidelines and results important updates

ఇంటర్‌ మూల్యాంకన ప్రక్రియ – ముఖ్యాంశాలు

  • జవాబు పత్రాల మూల్యాంకనంలో కచ్చితమైన తనిఖీ.
  • స్క్రూటినైజర్లు, సబ్జెక్ట్ నిపుణులు పత్రాలను నిశితంగా పరిశీలించాలి.
  • మూడు రకాల ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మార్కుల డేటా అప్‌లోడ్.
  • నామినల్ రోల్ దిద్దుబాట్లు పూర్తయ్యాకే తుది నిర్ణయం.

ఇంటర్‌ పరీక్షల సమీక్ష సందర్భంగా బోర్డు అధికారులు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే మూల్యాంకన తప్పిదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

ఈసారి ఫలితాలను మరింత త్వరగా ప్రకటించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) నిర్ణయించింది. అన్ని ప్రక్రియలు వేగంగా పూర్తైతే, ఫలితాలు ఏప్రిల్ మూడవ‌ లేదా నాల్గవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

చదవండి: 1161 Jobs: పదోతరగతి అర్హతతో సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ కొలువులు.. ఎంపిక విధానం ఇలా!

ఫలితాలను ఎలా చెక్‌ చేయాలి?

  • వెబ్‌సైట్‌కి వెళ్లండి – https://results.sakshieducation.com/
  • "TS Inter Results 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
  • హాల్ టికెట్ నెంబర్ & జన్మతేదీ ఎంటర్ చేయండి.
  • "Submit" బటన్ క్లిక్ చేయగానే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 03 Apr 2025 05:42PM

Photo Stories