ఎన్జీ రంగా వర్సిటీ డిప్లమా కోర్సుల కౌన్సెలింగ్...
Sakshi Education
గుంటూరు రూరల్ (ప్రత్తిపాడు): ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతోన్న వ్యవసాయ డిప్లమా కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగింది.
వర్సిటీ అధికారులు విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ర్యాంకులు, ఆర్‌జీయూకేటీ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించారు. 1,519 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరవగా వారిలో 162 మందికి సీట్లను కేటాయించారు. వ్యవసాయ డిప్లమా కోర్సులో 81, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో 8, పశుపోషణలో 28, మత్స్యలో 17, పాడి పరిశ్రమలో 2, ఉద్యానంలో 26 సీట్లను కేటాయించారు.
Published date : 08 Apr 2021 03:32PM