Diploma Admissions: ఎన్జీ రంగా యూనివర్శిటీలో డిప్లొమా ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..
గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ.. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
కోర్సుల వివరాలు
1. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ (కోర్సు వ్యవధి 2 ఏళ్లు)
2. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (కోర్సు వ్యవధి 2 ఏళ్లు)
3. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (కోర్సు వ్యవధి 2 ఏళ్లు)
4. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (కోర్సు వ్యవధి 3 ఏళ్లు)
అర్హత: పదో తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: ఆగస్టు 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి.
AP ADCET: ఏడీసెట్–2024 రద్దు.. మెరిట్ ఆధారంగా నేరుగా ప్రవేశాలు
ఎంపిక విధానం: టెన్త్‌లో వచ్చిన మార్కులు, వయస్సు ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 800 (ఎస్సీ/ఎస్టీ, వికలాంగులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: జూన్ 20, 2024