Krishi Vigyan Kendra: నైపుణ్య శిక్షణను వినియోగించుకోవాలి
Sakshi Education
మామునూరు: ఆర్థికంగా ఎదగడానికి గ్రామీణ యువత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త రాజన్న, వరంగల్ జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు మహ్మద్ హైదర్ గౌస్ సూచించారు.
ఈమేరకు మార్చి 11న మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో కోళ్ల పెంపకంపై రైతులకు ఆరురోజుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానం, కోడి మాంసం ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు.
చదవండి: DSC SGT Free Coaching: డీఎస్సీ, ఎస్జీటీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
సంవత్సరానికి సగటున 180 గుడ్లు తినాలన్నారు. అయితే ప్రస్తుతం 101 గుడ్లు మాత్రమే తింటున్నారన్నారు. అదేవిధంగా మాంసం సగటున 11.0 కిలోలు తినాలన్నారు. కానీ వినియోగం 9.8 కిలోలు ఉందన్నారు. ఈ నేపథ్యంలో కోళ్ల పెంపకంపై రైతులు దృష్టి సారించాలన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ శశంక్, డాక్టర్ సాయి కిరణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ అరుణ్ జ్యోతి, డాక్టర్ సౌమ్య, డాక్టర్ రాజు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
Published date : 13 Mar 2024 12:19PM